బిజెపికి గుడ్‌బై చెప్పనున్న పంకజ ముండే?




 




ముంబై: దివంగత బిజెపి నేత గోపీనాథ్ ముండే కుమార్తె, మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజ ముండే బిజెపికి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తన బంధువు, ఎన్‌సిపి అభ్యర్థి ధనంజన్ ముండే చేతిలో ఓటమి పాలైన పంకజ ముండే తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికను డిసెంబర్ 12న తన తండ్రి వర్ధంతి నాడు ప్రకటిస్తానని ఆమె వెల్లడించారు. అంతేగాక తన ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలలోని ప్రొఫైల్ నుంచి బిజెపి పేరును ఆమె తొలగించారు. తన తదుపరి అడుగు గురించి తాను కొంత ఆలోచించుకోవలసిన అవసరం ఉందని, డిసెంబర్ 12 లోగా తన భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకుంటానని ఆమె తెలిపారు. మహారాష్ట్రలో ఓటబిసి నాయకురాలైన పంకజ ముండే తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన బీడ్ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించారు.